Pawan Kalyan: ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ... వీడియో వైరల్!

Botsa Satyanarayana hugs Pawan Kalyan

  • అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం
  • పవన్ కు నమస్కారం చేసిన బొత్స
  • బొత్స స్పందన చూసి ఎదురెళ్లిన పవన్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల కారు ఎక్కేందుకు పవన్ వస్తుండటాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లిపోయారు. 

అదే సమయంలో బొత్స... పవన్ కు నమస్కారం చేశారు. బొత్స స్పందనను చూసిన పవన్ ఆయనకు ఎదురెళ్లారు. బొత్స కూడా పవన్ వద్దకు వచ్చి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు.

Pawan Kalyan
Janasena
Botsa Satyanarayana
YSRCP

More Telugu News