Keerthy Suresh: మహానటి పెళ్లి ఫిక్స్... ఎక్కడంటే?

Keerthi Suresh Marriage Fixed

  • వచ్చే నెల రెండో వారంలో గోవాలో కీర్తి సురేశ్ వివాహం!
  • ఏర్పాటు జరుగుతున్నాయంటూ డెక్కన్ క్రానికల్ రిపోర్ట్
  • అధికారికంగా ప్రకటించనున్న కీర్తి సురేశ్ తండ్రి

ప్రముఖ నటి కీర్తి సురేశ్ వివాహం అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహానటి పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరగనుందని తెలుస్తోంది. కేరళకు చెందిన వ్యాపారవేత్త, కీర్తి బాయ్ ఫ్రెండ్ ఆంటోని తటిల్ ను కీర్తి పెళ్లాడబోతోందని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ వెల్లడించింది. కీర్తి, తటిల్ స్కూల్ డేస్ నుంచే మంచి స్నేహితులని, వీరి అనుబంధం దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతోందని పేర్కొంది. డిసెంబర్ 11న లేదా 12న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని తెలిపింది.

ఇందుకోసం గోవాలో ఓ పెద్ద రిసార్ట్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇరుకుటుంబాలతో పాటు సన్నిహిత బంధువులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం పలకనున్నారని వివరించింది. ఈ విషయంపై కీర్తి సురేశ్ తండ్రి జి.సురేశ్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు డెక్కన్ క్రానికల్ వెల్లడించింది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సురేశ్ చెప్పారట. దీంతో కీర్తి సురేశ్ అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. కీర్తి, తటిల్ ల ఫొటోలు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Keerthy Suresh
Mahanati
keerthy Marriage
Goa Resort
Anthoni Thattil
  • Loading...

More Telugu News