Amaran: 'అమరన్' సినిమా తనకు మనశ్శాంతి లేకుండా చేసిందంటూ చెన్నై విద్యార్థి లీగల్ నోటీసులు

Student sues makers of Amaran after incessant calls from Sai Pallavis fans

  • ఆ సినిమాలో తన ఫోన్ నెంబర్ వాడుకున్నారని ఆరోపణ
  • రాత్రీపగలు తేడా లేకుండా తనకు ఫోన్లు వస్తున్నాయని ఆవేదన
  • రూ.కోటి పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ 

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టించిన ఈ సినిమాపై ఓ విద్యార్థి మండిపడ్డాడు. అమరన్ సినిమా విడుదలయ్యాక తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని సదరు నిర్మాతకు లీగల్ నోటీసులు పంపాడు. తనకు కలిగిన ఇబ్బందికి సినిమా నిర్మాతల నుంచి రూ.కోటి పరిహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఈమేరకు సినిమాను నిర్మించిన కమల్ హాసన్ కు, రాజ్ కమల్ ఫిల్మ్స్ కు లీగల్ నోటీసులు పంపించాడు.

అసలేం జరిగిందంటే..
అమరన్ సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి హీరో శివకార్తికేయన్ కు ఫోన్ నెంబర్ ఇచ్చే సన్నివేశం ఒకటి ఉంది. ఈ సీన్ లో సాయిపల్లవి చెప్పిన నెంబర్ కు ఫ్యాన్స్ తెగ ఫోన్లు చేస్తున్నారు. హీరోయిన్ తో పాటు హీరో అభిమానులు కూడా ఫోన్లు మెసేజ్ లు చేస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ తనదేనని, సినిమా విడుదలయ్యాక రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్లు, మెసేజ్ లు వస్తున్నాయని చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి వాగీశన్ చెప్పాడు.

అమరన్ టీమ్ వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, వెంటనే తన నెంబర్ ఉన్న సీన్ ను సినిమా నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరాడు. తన నెంబర్ వాడుకుని తనకు ఇబ్బంది కలిగించినందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.1 కోటి పరిహారం చెల్లించాలంటూ సినిమా టీమ్ కు లీగల్ నోటీసులు పంపించాడు.

  • Loading...

More Telugu News