AP Rain: ఏపీకి భారీ వర్ష సూచన.. మంగళ, బుధ వారాల్లో భారీ వర్షం

Rain Alert for Andhra Pradesh For Two Days

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • వాయుగుండంగా బలపడి 27న తీరం దాటుతుందన్న ఐఎండీ
  • కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి, తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీన పడి ఈ నెల 27న తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటుతుందని వెల్లడించారు. తుపాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళ, బుధ వారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు.

  • Loading...

More Telugu News