Maharashtra Election: మహారాష్ట్ర ఎన్నికలపై మరో రెండు ఎగ్జిట్ పోల్స్ విడుదల.. మొగ్గు ఎవరి వైపు ఉందంటే..!

two new exit polls says that Mahayuti alliance is forecast to win the Maharashtra election

  • యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్, టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • ఎన్డీయే కూటమికి 178-200 సీట్లు, విపక్ష కూటమికి 82-102 స్థానాలు వస్తాయన్న యాక్సిస్ మై ఇండియా
  • మహాయుతి కూటమి 175 సీట్లు గెలుచుకుంటుందన్న టుడేస్ చాణక్య

యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో పోరాడాయి. పోలింగ్ ముగిసిన బుధవారం సాయంత్రం వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమికి పట్టం కట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి.

విశ్వసనీయత కలిగిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ గురువారం రాత్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా మహాయుతి లేదా ఎన్డీయే కూటమి 178-200 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మ్యాజిక్ ఫీగర్ 145 మార్క్‌ను సునాయాసంగా సాధిస్తుందని లెక్కగట్టింది. ఇక మహా వికాస్ అఘాడి 82-102 సీట్లు గెలుస్తుందని విశ్లేషించింది.

ఇక ‘టుడేస్ చాణక్య’ కూడా ఎన్డీయేకి పట్టం కట్టింది. ఎన్డీయే 175 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్‌సీపీలతో కూడిన విపక్ష కూటమి 100 సీట్లకు పరిమితం అవుతుందని పేర్కొంది. కాగా ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల ప్రకారం మహారాష్ట్రలో 66 శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోల్చితే గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. కాగా పోస్టల్ బ్యాలెట్లను మొత్తం ఓట్ల శాతంలో కలపాల్సి ఉంది.

  • Loading...

More Telugu News