Perth Tes: పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన భారత్.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల అరంగేట్రం

India opt to bat first against Australia in Perth Test in Border Gavaskar Trophy

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా
  • కొత్త కుర్రాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షీత్ రాణా అరంగేట్రం
  • స్పిన్నర్ కోటాలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు
  • రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు దక్కని చోటు

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షురూ అయింది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ పడింది. భారత్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటుదక్కింది. అరంగేట్ర ఆటగాళ్లకు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ చెరొకరికి టీమిండియా క్యాప్స్ అందజేసి అభినందనలు తెలిపారు. మరోవైపు సీనియర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కలేదు.

తుది జట్లు ఇవే..
భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాస్ హేజిల్‌వుడ్.

కెప్టెన్లు ఏమన్నారంటే..
టాస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. మంచి పిచ్‌లా కనిపిస్తుండడంతో బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. తమ ప్రాక్టీస్‌పై పూర్తి నమ్మకం ఉందని, 2018లో ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడామని, కాబట్టి ఈ పిచ్‌పై ఏం ఆశించాలో తెలుసునని చెప్పాడు. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నారని ప్రకటించాడు. స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.

ఇక ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. ఫార్మాట్ ఏదైనా భారత్-ఆస్ట్రేలియా జట్లు పోటాపోటీగా తలపడతాయని అన్నాడు. నాథన్ మెక్‌స్వీనీ అరంగేట్రం చేస్తున్నాడని, ఓపెన‌ర్‌గా బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు.

  • Loading...

More Telugu News