: చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ బహిరంగ లేఖ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేడు బహిరంగ లేఖ రాశారు. పలు అంశాలపై వారు చంద్రబాబును తప్పుబట్టారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టరంటూ లేఖలో ప్రశ్నించారు. ఎనభైమంది శాసనసభ్యుల బలం ఉండి కూడా మీనమేషాలు లెక్కపెట్టడంలో ఆంతర్యమేమిటని వారు నిలదీశారు. వైఎస్ హయాంలో స్పీకర్ గా కిరణ్ నియామకాన్ని ప్రశ్నించిన బాబు.. ఇప్పుడాయన సీఎం పదవికి ఎలా అర్హుడవుతాడో చెప్పాలని డిమాండ్ చేశారు.