Soldier: తల్లిని సర్ ప్రైజ్ చేసిన జవాన్... వీడియో ఇదిగో!

Indian Army Soldier Surprised His Mom With Unexpected Visit

--


సైన్యంలో సేవలందిస్తున్న ఓ జవాను సెలవుపై ఇంటికి వచ్చాడు. తాను వస్తున్నట్టు ముందుగా ఎవరికీ చెప్పలేదు. నేరుగా తన తల్లి కొబ్బరి బోండాలు అమ్మే చోటుకు వెళ్లి ఓ కస్టమర్ లా ప్రవర్తించాడు. 

ఆర్మీ యూనిఫాంలో ముఖానికి మాస్క్ తో ఉన్న కొడుకును ఆ తల్లి గుర్తించలేదు. కొబ్బరి బోండాం కొట్టి ఇవ్వబోతుండగా కొడుకు తన మాస్క్ ను తీశాడు. దీంతో సడెన్ గా కొడుకును చూసిన ఆ తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టింది. వెంటనే ఆ జవాన్ తన తల్లిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే, తల్లికి ఆ జవాను ఇచ్చిన సర్ ప్రైజ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

  • Loading...

More Telugu News