BRS: కన్నతల్లికి తిండి పెట్టని కొడుకు.. అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్

KTR Serairs On Revanth Reddy

--


కన్న తల్లికి తిండి పెట్టని వ్యక్తి పిన్నికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఓవైపు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని ట్వీట్ చేశారు. మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. 

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని, రోజుకో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు మరణిస్తున్నా సరైన చర్యలు తీసుకోకుండా పిట్టలదొర మాటలు చెబుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆసుపత్రులలో, రైతులు జైళ్లలో, నిరుద్యోగులు రోడ్లపై ఆందోళనలలో ఉన్నారని చెబుతూ ‘జాగో తెలంగాణ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

BRS
KTR
Gurukula Patashala
Schools
Students
Food Poision
  • Loading...

More Telugu News