Rakul Preet Singh: ఒకేసారి ఇద్దరు భామలూ ఇలా మాయమైపోయారే!

Rakul and Rasi Khanna Special

  • 2011లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ 
  • 2014లో అడుగుపెట్టిన రాశి ఖన్నా 
  • ఒక్కసారిగా దూసుకుపోయిన రకుల్ 
  • తాపీగా అడుగులు వేసిన రాశి 
  • ఒకేసారి వెనుకబడిన భామలు


తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రకుల్ ప్రీత్ - రాశీ ఖన్నా ఇద్దరి పేర్లూ కనిపిస్తాయి. దాదాపు ఇద్దరూ ఒకే సమయంలో తమ కెరియర్ ను పరిగెత్తించారు. రకుల్ 2011లో 'కెరటం' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె స్టార్ డమ్ ను అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చకచకా స్టార్ హీరోల జోడిగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్లింది. అందుకు తగినట్టుగానే ఆమెకి సక్సెస్ లు కూడా దొరికాయి. 

ఇక రాశి ఖన్నా విషయానికి వస్తే, రకుల్ కంటే కాస్త ఆలస్యంగా 2014లో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 'మనం' సినిమాలో తళుక్కున మెరిసిన ఆమె, కథానాయికగా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత కూడా ఆమెను సక్సెస్ లు పలకరించాయి. అయితే కెరియర్ ఆరంభంలో రాశి ఖన్నా కాస్త పద్ధతిగా తెరపై కనిపించడానికే ఇష్టపడింది. అందువలన ఆమెకి అవకాశాలు తగ్గాయనేది వాస్తవం. రకుల్ దూకుడు ముందు ఇతర హీరోయిన్స్ ఆగలేకపోయారు. ఒక్కో స్టార్ హీరోతో ఒకటికి మించి సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమెను ఒక్కసారిగా పరాజయాలు చుట్టుముట్టాయి. దాంతో చాలా వేగంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఫలితంగా 2021లో చేసిన 'కొండపొలం' తరువాత మళ్లీ ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. అప్పటి నుంచి ఆమె బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

ఇక రాశి ఖన్నా గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది గానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. బాలీవుడ్ ఛాన్సుల కోసం ఆమె బాగా సన్నబడింది. అయితే ఆమెను బొద్దుగా చూడటానికి ఇష్టపడిన తెలుగు ప్రేక్షకులకు ఇది నచ్చలేదు. దానికి తోడు 'పక్కా కమర్షియల్' .. 'థ్యాంక్యూ' వంటి పరాజయాలు వెంటవెంటనే పడ్డాయి. అప్పటి నుంచి ఆమె కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలోకి కొత్తగా చేరిన తెలుగు సినిమా 'తెలుసుకదా' మాత్రమే. ఇలా 'ఆలస్యం అమృతం విషం' అన్నట్టుగా పరిగెత్తిన రకుల్, 'నిదానమే ప్రధానం' అన్నట్టుగా తాపీగా అడుగులు వేసిన రాశి ఖన్నా జోరూ ఒకేసారి తగ్గడమే ఇక్కడ ఆశ్చర్యపోవలసిన విషయం. 

Rakul Preet Singh
Actress
Rasi Khanna
Tollywood
  • Loading...

More Telugu News