Zomato CEO: జొమాటోలో అత్యున్నత ఉద్యోగం.. తొలి ఏడాది జీతం వుండదు.. 20 లక్షలు మనమే కట్టాలి!

Zomato CEO hiring Chief of Staff says first year no salary and employee will have to pay Rs 20 lakh

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జొమాటో సీఈవో పోస్టు
  • రెండో ఏడాది నుంచి రూ.50 లక్షలకు పైనే జీతం
  • నేరుగా తనకే కవరింగ్ లెటర్ రాయాలని దీపిందర్ గోయెల్ సూచన

జొమాటోలో అత్యున్నత పోస్టుకు తెలివైన, చురుకుదనం, నేర్చుకోవాలనే తపన ఉన్న అభ్యర్థి కావాలని సంస్థ సీఈవో దీపిందర్ గోయెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంస్థలోనే అత్యున్నత పోస్టు అంటున్నారు కాబట్టి జీతం కూడా భారీగానే ఉంటుందని అనుకోవడం సహజం. అయితే, ఇక్కడే దీపిందర్ ఓ మెలిక పెట్టారు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా చెల్లించబోమని చెప్పారు. అక్కడితో ఆగినా బానే ఉండేది కానీ సదరు ఎంపికైన అభ్యర్థే ఎదురు డబ్బులివ్వాలని, అదికూడా రూ.20 లక్షలు అని వివరించారు.

తొలి ఏడాది కోసం ఫీజుగా రూ.20 లక్షలను జొమాటో ఆధ్వర్యంలోని నాన్ ప్రాఫిట్ కంపెనీకి విరాళంగా అందించాలని తెలిపారు. ఏడాదిపాటు సంతృప్తికరంగా పనిచేస్తే ఆ మరుసటి ఏడాది నుంచి రూ.50 లక్షలకు పైగా వార్షిక వేతనంతో నియామకపు ఉత్తర్వులు ఇస్తామని వివరించారు. అంతేకాదు, తొలి ఏడాదికి సంబంధించి రూ.50 లక్షలను ఉద్యోగి సూచించిన ఛారిటీ సంస్థకు జొమాటో విరాళంగా ఇస్తుందని దీపిందర్ పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా రెజ్యుమె పంపాల్సిన అవసరం లేదని, ఆసక్తి ఉన్న వారు నేరుగా తనకే ఓ కవరింగ్ లెటర్ రాయాలని చెప్పారు. కాగా, ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News