Tirumala: తిరుమల దర్శనానికి సంబంధించి... టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి కేటీఆర్ విజ్ఞప్తి

TTD Chairman BR Naidu meets KTR

  • కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ నాయుడు
  • తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
  • తెలంగాణ దేవాలయాలకు తోడ్పాటును అందించాలన్న కేటీఆర్

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. బీఆర్ నాయుడుకు కేటీఆర్ శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి వారి జ్ఞాపికను అందించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు లేఖల విషయమై విజ్ఞప్తి చేశారు. అలాగే, కరీంనగర్‌, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు వేగంగా పూర్త‌య్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు.

Tirumala
KTR
BR Naidu
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News