Skin Health: బొప్పాయి గుజ్జు రాస్తే.​.. మన స్కిన్​ కు ఏమవుతుంది?

benefits of papaya on our skin

  • ఎన్నో అద్భుతమైన పోషకాలకు నిలయం బొప్పాయి
  • శరీరంలో కొన్ని అవయవాలు బాగా పనిచేసే పదార్థాలు దాని సొంతం
  • మన చర్మంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై నిపుణుల సూచనలు

బొప్పాయి పండ్లు ఎన్నో అద్భుతమైన పోషకాలను మన శరీరానికి అందిస్తాయి. మన జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటిది బొప్పాయి గుజ్జును మన చర్మంపై రాసుకుంటే... అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మాన్ని నిగనిగలాడేలా చేసే ఐదు లక్షణాలు బొప్పాయిలో ఉన్నాయని వివరిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన ఆ ప్రయోజనాలు ఇవిగో...

మొటిమలను తగ్గిస్తుంది
బొప్పాయిలోని పపైన్ గా పిలిచే ఎంజైమ్ ప్రొటీన్లను ముక్కలు చేసి, చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. చర్మ రంధ్రాలు బాగా తెరుచుకునేలా చేసి... మొటిమలను నియంత్రిస్తుంది. 

ముడతలు పడకుండా...
బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. చర్మంపై బొప్పాయి గుజ్జును రాసుకున్నప్పుడు... ఈ లైకోపీన్ చర్మంలోని ఫ్రీర్యాడికల్స్ ను తొలగించి, ముడతలు పడకుండా చూస్తుంది.

చర్మం తడి ఆరిపోకుండా...
బొప్పాయిలో నీటి శాతం ఎక్కువ. తరచూ బొప్పాయి గుజ్జు లేదా రసంతో చర్మంపై మసాజ్ చేయడం వల్ల... తడి ఆరిపోకుండా, నిగనిగలాడుతూ ఉంటుంది.

చర్మాన్ని బాగా క్లెన్సింగ్ చేస్తుంది
బొప్పాయి గుజ్జుతో మర్దన చేసినప్పుడు... చర్మంపై వ్యర్థాలను తొలగించి, స్వేద రంధ్రాలను శుభ్రం చేస్తుంది. చర్మం లోపలి పొరల వరకు కూడా ప్రభావం చూపించి మెరుపును తెస్తుంది.

ముఖంపై వెంట్రుకలను తొలగిస్తుంది
మహిళలకు ముఖంపై ఉండే సన్నని వెంట్రుకలను బొప్పాయి తొలగిస్తుంది. బొప్పాయిలోని కొన్ని రకాల ఎంజైములు... సన్నని వెంట్రుకల కుదుళ్లను బలహీనం చేస్తాయి. తిరిగి వెంట్రుకలు పెరగకుండా చూస్తాయి.

Skin Health
papaya
health
offbeat
science
Trending
  • Loading...

More Telugu News