Hyderabad: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత!... వీడియో ఇదిగో

Demolition of tilted Gachibowli building

  • కొనసాగుతున్న భవనం కూల్చివేత పనులు
  • పూర్తిస్థాయిలో కూల్చేందుకు మరికొన్ని గంటల సమయం
  • నిన్న రాత్రి పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం పక్కకు ఒరిగింది. పక్కన ప్రారంభమైన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆ ప్రభావం పడిందని అంటున్నారు. దీంతో నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ భవనం ఒక్కసారిగా గుంతల వైపు వంగింది.

ఈ భవనం చుట్టుపక్కల స్థానికులను హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించి, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్నారు. పైఅంతస్తు నుంచి కూల్చివేతను ప్రారంభించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ భవనం పూర్తిస్థాయిలో కూల్చివేసేందుకు మరికొన్ని గంటలు పట్టనుంది.

Hyderabad
Building
HYDRA

More Telugu News