Moon: అంతరిక్షంలో చంద్రోదయం... అద్భుత దృశ్యం
- భూమ్మీద చంద్రోదయాన్ని చూసే అవకాశం తక్కువ
- అంతరిక్షంలో అయితే ఎలాంటి అడ్డంకులూ లేకుండా వీక్షించే అవకాశం
- చంద్రుడిని ఫొటోలు తీసిన నాసా శాస్త్రవేత్త నిక్ హేగ్
సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకోసం సముద్ర తీర ప్రాంతాలకు కూడా వెళుతుంటారు. అలాగే చంద్రోదయం కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చంద్రుడు ఉదయించే సమయం మారుతూ ఉండటం వల్ల... సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లినా బాగా కనిపించే అవకాశం తక్కువ. అదే అంతరిక్షంలో చంద్రోదయానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. అదే ఈ అద్భుత దృశ్యం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి...
భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తున్న నాసా శాస్త్రవేత్త నిక్ హేగ్... ఇటీవల ఈ చిత్రాలు తీశారు. భూమి మీదుగా చంద్రుడు ఉదయించడాన్ని అంతరిక్షం నుంచి చూడటం ఎంతో అద్భుతమైన అనుభూతి అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. చందమామకు తాము లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా... మనకు అందేంత దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆయన పెట్టిన ఈ పోస్టును నాసా తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో రీపోస్ట్ చేసింది.