Lagacharla: లగచర్ల ఘటన... పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు సురేశ్

Suresh surrendered before police

  • ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో సురేశ్
  • కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • కలెక్టర్ మీద దాడి కేసులో కీలక నిందితుడిగా సురేశ్

వికారాబాద్ జిల్లా లగచర్ల కేసు కీలక నిందితుడు సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కలెక్టర్ మీద దాడి కేసులో ఇతను ఏ2 నిందితుడిగా ఉన్నాడు. సురేశ్‌ను పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. లగచర్ల ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఘటన జరిగిన రోజు కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. కలెక్టర్ అక్కడకు వెళ్లగానే ఆందోళనకారులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో సురేశ్ కూడా నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించింది. స్థానికులను రెచ్చగొట్టి... ఈ దాడికి కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Lagacharla
Vikarabad District
District Collector
Telangana
  • Loading...

More Telugu News