Stock Market: స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్
- 239 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 65 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.55 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
గత కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ గాడిలో పడ్డాయి. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 77,578కి పెరిగింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 23,518 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.55%), టెక్ మహీంద్రా (2.28%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.21%), సన్ ఫార్మా (1.60%), టాటా మోటార్స్ (1.47%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.44%), టాటా స్టీల్ (-1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.21%), మారుతి (-1.13%).