Kim Jong Un: కిమ్ తో భేటీ అయిన రష్యా మంత్రి

Russian minister meets Kim Jong Un

  • ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా
  • పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తున్న కిమ్
  • కిమ్ తో రష్యా మంత్రి భేటీ అయ్యారన్న అక్కడి అధికారిక మీడియా

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయింది. ఈ యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా అండగా ఉంది. రష్యాకు పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తోంది. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా సహజవనరులు, జీవావరణ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. 

ఇది స్నేహపూర్వకమైన భేటీగా సదరు వార్తా సంస్థ పేర్కొంది. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక సహకారంతో పాటు పలు అంశాలపై వీరు చర్చించుకున్నారని తెలిపింది. మరోవైపు రష్యన్ మిలిటరీ అకాడెమీ ప్రతినిధులు కూడా కొరియాలో పర్యటించినట్టు సమాచారం.

Kim Jong Un
North Korea
Russia
  • Loading...

More Telugu News