Aghori: ఎట్టకేలకు అఘోరీని అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు

Police arrest Aghori

  • కొన్నిరోజులుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అఘోరీ హల్ చల్
  • ఇవాళ పవన్ కల్యాణ్ ను కలవాలంటూ హంగామా
  • అడ్డుకున్న పోలీసులపై దాడి
  • ఈడ్చుకెళ్లి డీసీఎం వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు

గత కొన్ని రోజులుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అఘోరీ హల్ చల్ చేస్తుండడం తెలిసిందే. జనజీవనానికి ఆటంకం కలిగించే రీతిలో ఆమె చేష్టలు ఉండడంతో, ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఆ అఘోరీ మంగళగిరిలోనూ తన చర్యలతో అందరినీ హడలెత్తించింది. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనంటూ ఏకంగా జాతీయ రహదారిపై బైఠాయించింది. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆమెను అక్కడ్నించి తరలించేందుకు పోలీసులు యత్నించగా, ఆమె వారిపైనా చేయిచేసుకుంది. 

అనంతరం, పోలీసులు ఆ అఘోరీని అక్కడ్నించి బలవంతంగా తరలించారు. ఓ డీసీఎం వ్యాన్ ను తీసుకొచ్చిన పోలీసులు... ఆమెను ఈడ్చుకెళ్లి ఆ వ్యాన్ లోకి ఎక్కించారు. దాంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది.

Aghori
Police
Mangalagiri

More Telugu News