Ashika Ranganath: అందానికి ఆనవాలు ఆషికా రంగనాథ్!

Ashika Ranganath Special

  • 'అమిగోస్'తో పరిచయమైన ఆషికా రంగనాథ్
  • 'నా సామిరంగ'తో మాస్ వైపు నుంచి మార్కులు
  • అందాల చందమామగా యూత్ వైపు నుంచి క్రేజ్   
  • సెట్స్ పై ఉన్న 'సర్దార్ 2'
  • ఆశించిన స్థాయిలో తెలుగులో దక్కని అవకాశాలు


ఒకప్పుడు తెలుగు తెరపై బాలీవుడ్ భామల జోరు ఎక్కువగా కనిపించేది. ఆ తరువాత కాలంలో తమిళ... మలయాళ బ్యూటీల సందడి పెరుగుతూ వెళ్లింది. ఇక ఈ మధ్య కాలంలో కన్నడ సీమ నుంచి టాలీవుడ్ కి పరిచయమనవుతున్న అందగత్తెల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. అలా కన్నడ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన భామలలో ఆషికా రంగనాథ్ కూడా కనిపిస్తుంది.

తెలుగులో నిన్నమొన్నటి వరకూ అటు పూజ హెగ్డే... రష్మిక... కీర్తి సురేశ్ హవా కొనసాగుతూ ఉండగా, ఇటు కృతి శెట్టి... శ్రీలీల తమ దూకుడు చూపుతూ వచ్చారు. ఈ రెండు వైపుల నుంచి అనుకోకుండానే ఒక చిన్నపాటి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాపులోనే ఆషికా రంగనాథ్ పరిచయమైంది. 'అమిగోస్' సినిమాతో అడుగుపెట్టిన ఆషికా, ఆ తరువాత 'నా సామిరంగ'లోను అలరించింది. నిజం చెప్పాలంటే 'నా సామిరంగ' సినిమాకి ఆమె గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.ఆషికా రంగనాథ్... నాజూకుదనానికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో తాజా చందమామలా అనిపిస్తుంది. దివ్యభారతి తరువాత ఆ స్థాయి ఆకర్షణ కలిగిన బ్యూటీగా మార్కులు కొట్టేసింది. చీరకట్టులోను... మోడ్రన్ డ్రెస్ లలోను ఆమెకి వంకబెట్టాల్సిన అవసరం లేదనేది యూత్ టాక్. అలాంటి ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలోనే సీనియర్ స్టార్ జోడీగా చేయడం వలన, ఆమె యంగ్ హీరోల సరసన చేసే ఛాన్స్ పోగొట్టుకుందనే విమర్శలు కూడా వినిపించాయి. 

సీనియర్ స్టార్స్ సరసన మెరిసినా, ఆమె టాలీవుడ్ లో బిజీ  కావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినవారూ ఉన్నారు. కారణమేదైనా ఆశించిన స్థాయిలో ఆషికా దూసుకెళ్లడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో 'విశ్వంభర' చేస్తున్నా అది ప్రధాన కథానాయిక పాత్ర కాదు. ఇక తమిళంలో సిద్ధార్థ్ జోడీగా చేసిన 'మిస్ యూ' ఈ నెల 29న విడుదల కానుంది. కార్తీ సరసన చేస్తున్న 'సర్దార్ 2' సెట్స్ పై ఉంది.

Ashika Ranganath
Nagarjuna
Siddharth
Karthik
  • Loading...

More Telugu News