Nara Rohit: కష్టకాలంలో పెదనాన్న, పెద్దమ్మ అండగా నిలిచారు: నారా రోహిత్

Nara Rohit tweet

  • రెండు రోజుల క్రితం కన్నుమూసిన నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు
  • నారావారిపల్లెలో నిన్న జరిగిన అంత్యక్రియలు
  • పెదనాన్న, పెద్దమ్మ మాటలు ఎంతో ధైర్యాన్ని నింపాయన్న రోహిత్

సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు గత శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వగ్రామం నారావారిపల్లెలో నిన్న అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా నారా రోహిత్ తన పెదనాన్న చంద్రబాబు, సన్నిహితుల గురించి ఎక్స్ వేదికగా స్పందించారు. తన తండ్రి మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

క్లిష్ట సమయంలో పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయని అన్నారు. అడుగడుగునా అండగా నిలబడ్డ పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రహ్మణి వదినకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు.

Nara Rohit
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News