Mokshagna: మోక్షజ్ఞ జోడిగా రాషా తడాని .. ఆమె గురించి సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్!

- హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ
- ఆయన జోడీగా రవీనా టాండన్ కూతురు
- సినిమాల్లోకి రాకముందే క్రేజ్ తెచ్చుకున్న రాషా తడాని
- వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా
నందమూరి వారసుడిగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో కాస్త ఆలస్యమవుతూనే వచ్చింది. మోక్షజ్ఞకి హీరోగా చేయాలనే ఇంట్రెస్ట్ లేదేమోనని కూడా అనుకున్నారు. కానీ ఆయన నటన .. డాన్సులు .. ఫైట్లు .. గుర్రపు స్వారీ వగైరా నేర్చేసుకుని రంగంలోకి దిగిపోయాడు.
సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధమైపోయింది. మోక్షజ్ఞ ఫస్టు లుక్ పోస్టర్ కూడా బయటికి వచ్చేసింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో విక్రమ్ తనయుడు ధృవ్ కనిపించనున్నాడనీ, హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్ కి పరిచయం కానున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇక్కడి ఫ్యాన్స్ ఈ బ్యూటీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
