IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు

IT Raids In Swastik Group Hyderabad

  • రూ. 300 కోట్ల విలువైన భూమిని అమ్మిన కంపెనీ
  • లెక్కల్లో చూపకపోవడంతో ఐటీ అధికారుల రెయిడ్
  • కంపెనీ యజమానుల ఇళ్లల్లో సోదాలు

హైదరాబాద్ లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. సోమవారం ఉదయం నగరంలో మూడుచోట్ల ఏకకాలంలో రెయిడ్స్ చేశారు. ఇటీవల జరిగిన విలువైన భూమి అమ్మకానికి సంబంధించిన సొమ్మును లెక్కల్లో చూపకపోవడంతో అధికారులు ప్రస్తుతం సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సిటీకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ గ్రూప్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

షాద్ నగర్ ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన భూమిని మల్టీ నేషనల్ కంపెనీకి అమ్మింది. అయితే, ఈ లావాదేవీకి సంబంధించిన సొమ్మును స్వస్తిక్ గ్రూప్ తన బ్యాలెన్స్ షీట్ లో చూపించలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు తాజాగా స్వస్తిక్ గ్రూప్ యజమానులు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ ల నివాసాలతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ లోని ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు చేపట్టారు.

IT Raids
Hyderabad
Swastik Group
Banjara Hills
Chevella
  • Loading...

More Telugu News