Shamshabad Air Port: విమానంలో సిగిరెట్ తాగి దొరికిపోయిన యువకుడు
- విమానంలో యువకుడు సిగరెట్ తాగటాన్ని గమనించిన ఎయిర్ హోస్టస్
- యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్టు పోలీసులు
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన
కొంత మంది తెలిసీ తెలియక చేసిన తప్పులు వారిని ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. విమానంలో సిగిరెట్ తాగడం నిషేధం. ఈ విషయం చాలా మంది ప్రయాణికులకు తెలుసు. అయితే ఓ యువకుడు సెక్యురిటీ కళ్లు గప్పి మరీ విమానంలోకి సిగరెట్లతో ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సిగరెట్ తాగి అడ్డంగా బుక్ అయ్యారు. ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆదివారం జరిగింది.
విషయంలోకి వెళితే..హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ అనే యువకుడు ఆబుదాబీకి వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఈ-1408 సర్వీస్ ఎక్కాడు. అయితే విమానం టేకాఫ్ తీసుకోవడానికి సమాయత్తం అవుతుండగా, అహ్మద్ రహస్యంగా సిగరెట్ తాగాడు. ఇది గమనించిన ఎయిర్ హోస్టస్ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఎంతో క్షుణ్ణంగా జరిగే తనిఖీలను తప్పించుకుని అతను సిగరెట్‌తో విమానంలోకి ఎలా ప్రవేశించాడనే దానిపై ప్రయాణీకులు చర్చించుకుంటున్నారు.