Cyclone: ఏపీకి మరో తుపాను ముప్పు.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం

Cyclone to be hit Andhra Pradesh

     


ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆపై పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుపాను దిశ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26, లేదంటే 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుందని పేర్కొన్నారు. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Cyclone
Heavy Rains
Andhra Pradesh
Bay Of Bengal
  • Loading...

More Telugu News