Bandi Sanjay: తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు: బండి సంజయ్

Telangana has two CMs says Bandi Sanjay

  • తెలంగాణకు రేవంత్, కేటీఆర్ ఇద్దరు సీఎంలు అన్న బండి సంజయ్
  • కేటీఆర్ నటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య
  • కేటీఆర్ కు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని ప్రశ్న

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ చాలా అమాయకంగా నటిస్తున్నారని, ఆయన నటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ కు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? అని ప్రశ్నించారు. 

ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం అంశాల్లో అరెస్టులు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని... కానీ, కాంగ్రెస్ హైకమాండ్ ను బీఆర్ఎస్ నేతలు కలవగానే కాళేశ్వరం స్కామ్ ఎటు పోయిందో? అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి నాటకాలు చేస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉన్నారని... ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు కేటీఆర్ అని చెప్పారు. RK (రేవంత్, కేటీఆర్) బ్రదర్స్ పాలన కొనసాగుతోందని చెప్పారు. 

బీఆర్ఎస్ ఒక విధ్వంసకర పార్టీ అని... ఆ పార్టీని నిషేధించాలని అన్నారు. బీఆర్ఎస్ ను నియంత్రించాల్సిన బాధ్యత రేవంత్ పై ఉందని... ఆయన అసమర్థత వల్లే బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.

Bandi Sanjay
BJP
Revanth Reddy
Congress
KTR
BRS
  • Loading...

More Telugu News