Chandrababu: రామ్మూర్తి అంతిమయాత్ర ప్రారంభం... తమ్ముడి పాడె మోసిన చంద్రబాబు

Ramamurthy Naidu final rituals started

  • చంద్రబాబు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం
  • తల్లిదండ్రుల అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే రామ్మూర్తి అంత్యక్రియలు
  • అంత్యక్రియలకు హాజరైన మహారాష్ట్ర గవర్నర్

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర ప్రారంభమయింది. స్వగ్రామం నారావారిపల్లెలోని నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతోంది. తమ్ముడి పాడెను చంద్రబాబు మోశారు. అంతిమయాత్రలో బంధువులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుకాలం వచ్చే లోపలే అంత్యక్రియలను పూర్తి చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. 

తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలకు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా హాజరుకావడం గమనార్హం.

Chandrababu
Ramamurthy Naidu
Telugudesam
  • Loading...

More Telugu News