BR Naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాజేంద్రప్రసాద్ ఆత్మీయంగా... వీడియో ఇదిగో!

Rajendra Prasad met BR Naidu

  • ఇటీవల టీటీడీ చైర్మన్ గా నియమితుడైన బీఆర్ నాయుడు
  • మర్యాదపూర్వకంగా కలిసిన రాజేంద్రప్రసాద్
  • ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న బీఆర్ నాయుడు 

టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు ఇటీవల టీటీడీ చైర్మన్ గా నియమితులవడం తెలిసిందే. కొన్నిరోజుల కిందటే ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో, సినీ నటుడు రాజేంద్రప్రసాద్... బీఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

తనకోసం వచ్చిన రాజేంద్రప్రసాద్ ను చూడగానే బీఆర్ నాయుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనుబంధం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం, బీఆర్ నాయుడు, రాజేంద్రప్రసాద్ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

BR Naidu
Rajendra Prasad
TTD Chairman
TV5
Tollywood

More Telugu News