Sri Reddy: శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు

One more case against Sri Reddy

  • శ్రీరెడ్డిపై మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు
  • చంద్రబాబు, పవన్ లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు

వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. సినీ నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదయింది. మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, వారి కుటుంబ సభ్యులపై శ్రీరెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని దాసరి జ్యోతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరోవైపు, హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే శ్రీరెడ్డిపై కేసు నమోదయింది. కూటమి నేతలపై శ్రీరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు మజ్జి పద్మ మాట్లాడుతూ... గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు శ్రీరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Sri Reddy
Police Case
  • Loading...

More Telugu News