khammam medical college: మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్

raging khammam medical college

  • ఖమ్మం మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన 
  • అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు హాస్టల్ విధుల నుంచి తప్పించిన ప్రిన్సిపాల్
  • నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు

ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై బాధిత విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరిగా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లు ఇలా కటింగ్ చేయించుకోవద్దని సూచించారు. దీంతో అతను సెలూన్ కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన విద్యార్థిని సెలూన్‌కు తీసుకువెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని ప్రిన్సిపాల్ మీడియాకు తెలిపారు.

khammam medical college
raging
Telangana
  • Loading...

More Telugu News