Chandrababu: నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు, మహారాష్ట్ర గవర్నర్.. కాసేపట్లో రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర

Chandrababu reaches Naravaripalle

  • చంద్రబాబుతో పాటు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి, కుటుంబసభ్యులు
  • మధ్యాహ్నం 2 గంటలకు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు
  • తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమక్రియలు

తన తమ్ముడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా చంద్రబాబుతో పాటు వచ్చారు.

అంతకు ముందే రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని నారావారిపల్లెకు తరలించారు. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి తీసుకొచ్చారు. రామ్మూర్తి పార్థివదేహాన్ని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. కాసేపట్లో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు నారావారిపల్లెకు తరలివచ్చారు. తమ తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి.

Chandrababu
Telugudesam
Naravaripalle
  • Loading...

More Telugu News