air india express: తెలుగు రాష్ట్రాల నుంచి అదనపు సర్వీసులు ప్రకటించిన ఎయిరిండియా

air india express additional services from telugu states
  • విమాన ప్రయాణీకులకు ఎయిరిండియా గుడ్ న్యూస్
  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఎయిరిండియా అదనపు సర్వీసులు
  • ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెంపు
తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణీకులకు ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. శీతాకాల సర్వీసుల్లో భాగంగా అదనపు సర్వీసులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అదనపు సర్వీసులను ప్రకటించడంతో ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెరిగాయి. 
 
కొత్తగా ప్రకటించిన సర్వీసుల్లో హైదరాబాద్ - గ్వాలియర్ డైరెక్ట్ సర్వీస్, విశాఖపట్నం - విజయవాడ సర్వీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసుల సంఖ్య పెంచారు. అలానే హైదరాబాద్ నుంచి 17 దేశీయ గమ్యాలు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన విమానాశ్రయాలకు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుపుతున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ తెలిపారు. 

విజయవాడ నుంచి అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక సంస్థ ఎయిరిండియానే అని ఆయన చెప్పారు. సీజన్ మొత్తం మీద ఈ నగరాల నుంచి సర్వీసుల సంఖ్య 45 శాతం పెరిగినట్లు అంకుర్ గార్గ్ తెలిపారు.
air india express
telugu states
Business News
Flights

More Telugu News