Vishnu Kumar Raju: జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుంది: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju fires on Jagan

  • కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ నాశనం చేశారన్న విష్ణురాజు
  • 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శ
  • తాను ఐదు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి బతికానని వెల్లడి

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని అన్నారు. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 

వైసీపీ హయాంలో చేసిన పనులకు డబ్బులు రాక, చేసిన అప్పులకు బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను 1983 నుంచి కాంట్రాక్టులు చేస్తున్నానని... కానీ దుర్మార్గమైన, రాక్షస జగన్ ప్రభుత్వం వద్ద మాత్రం పనులు చేయలేదని అన్నారు. కాంట్రాక్టర్లకు జగన్ పెట్టిన బాధలకు... తానైతే పది సార్లు ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పారు. జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా? అని ఎదురు చూస్తున్నానని... ఆయనను అసెంబ్లీకి పిలిపించాలని అన్నారు. 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని మండిపడ్డారు. తాను ఐదు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతికిన వ్యక్తినని చెప్పారు.

Vishnu Kumar Raju
BJP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News