Nara Lokesh: ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి రామకృష్ణ

Nara Lokesh reaches AIG hospital

  • విషమంగా నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి
  • అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే హైదరాబాద్ కు బయల్దేరిన లోకేశ్
  • కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, మంత్రి నారా లోకేశ్ చిన్నాన్న రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన... తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే... సమావేశాల మధ్యలోనే హైదరాబాద్ కు పయనమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు.

నందమూరి కుటుంబసభ్యులు కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఇంతవరకు వైద్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Nara Lokesh
ramamurthy Naidu
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News