Chandrababu: సమాజంపై తిరుగులేని ముద్రవేసిన మహనీయుడు రామోజీరావు: చంద్రబాబు

Ramoji Rao is inspiration to all says Chandrababu

  • నేడు రామోజీరావు జయంతి
  • రామోజీకి నివాళి అర్పించిన చంద్రబాబు
  • రామోజీ జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని పిలుపు

రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు, దివంగత రామోజీరావు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ... విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత వైఖరితో సమాజంపై తిరుగులేని ముద్ర వేసిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు. 

వ్యాపారాలలో సైతం సమాజహితం, ప్రజా శ్రేయస్సు చూపిన ఏకైక వ్యాపారవేత్త అని చంద్రబాబు కితాబునిచ్చారు. తన సంస్థల ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన రామోజీరావును స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నిత్య స్ఫూర్తిగా నిలిచే రామోజీరావు జీవితాన్ని మార్గదర్శిగా భావించి అందరం ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు.

Chandrababu
Telugudesam
Ramoji Rao
Eenadu
  • Loading...

More Telugu News