G. Kishan Reddy: రేవంత్ రెడ్డి సవాల్‌పై 'బీజేపీ మూసీ నిద్ర'... అంబర్‌పేటలో కిషన్ రెడ్డి బస

BJP Musi Nidra in Hyderabad

  • ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 వరకు బస
  • 20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస
  • అక్కడే రాత్రి భోజనం, నిద్ర, మరుసటి రోజు అల్పాహారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు 20 మంది బీజేపీ ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో బస చేయనున్నారు. రాత్రి భోజనం, రాత్రి నిద్ర, మరుసటి రోజు అల్పాహారం అక్కడే చేయనున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలతో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ మనోధైర్యం ఇవ్వనున్నారు.

అంబర్‌పేటలోని తులసీరాంనగర్‌లో కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్‌పేటలోని శాలివాహననగర్‌లో కె.లక్ష్మణ్, ఎల్బీ నగర్‌లోని గణేశ్ నగర్‌లో ఈటల రాజేందర్, రాజేంద్రనగర్‌లోని హైదర్‌షా కోటలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అఫ్జల్‌గంజ్‌లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు. వారితో పాటు ఆయా ప్రాంతాల స్థానిక నేతలు కూడా బస చేస్తారు.

G. Kishan Reddy
BJP
Telangana
Revanth Reddy
  • Loading...

More Telugu News