Ayyanna Patrudu: మంత్రులు ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Speaker fires at AP ministers

  • ఈఎస్ఐపై సభలో ప్రశ్న
  • సమాధానం చెప్పేందుకు అందుబాటులో లేని మంత్రి
  • మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా అన్న స్పీకర్

ఏపీ అసెంబ్లీలో మంత్రులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా మంత్రులే సభకు ఆలస్యంగా వస్తే ఎలా? అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని, సరైన సమయంలో వచ్చి సభ్యులు అడిగిన వాటికి సమాధానం ఇవ్వాలని సూచించారు.

తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రిపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ అందుబాటులో లేరు. దీంతో స్పీకర్ పైవిధంగా స్పందించారు. మరోవైపు, కడపలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్న వేశారు. అయితే ఆమె విప్‌గా ఉండటంతో ప్రశ్న అడిగేందుకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ తెలిపారు.

Ayyanna Patrudu
Andhra Pradesh
AP Assembly Session
  • Loading...

More Telugu News