KP Vivekananda: ఆ ఘటనపై రేవంత్ రెడ్డి ఫోన్ చేయగానే బండి సంజయ్ స్పందించారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Fevicol bonding between Bandi Sanjay and Revanth Reddy

  • రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయ మంత్రిగా పని చేస్తున్నారని ఎద్దేవా
  • తెలంగాణలో 11 నెలలుగా అటవిక పాలన సాగుతోందని విమర్శ
  • కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తోందని మండిపాటు

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీ జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ వెళ్లగానే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయ మంత్రిగా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో 11 నెలలుగా అటవిక పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేస్తోందని విమర్శించారు. సీఎం ఇప్పటి వరకు తన మార్క్ చూపించలేకపోయారన్నారు.

కానీ అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీశ్ రావులపై బురద జల్లుతున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కానీ కేసీఆర్ ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు.

వారిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి జరిగితే బండి సంజయ్ ఎక్కడ నిద్రపోయారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

KP Vivekananda
BRS
Revanth Reddy
Bandi Sanjay
  • Loading...

More Telugu News