Movies: హిస్టరీలో అత్యంత కాస్ట్లీ సినిమాలు ఏవో తెలుసా?

Do you know what are the most expensive movies in history

  • నానాటికీ పెరిగిపోతున్న సినిమాల బడ్జెట్
  • నటుల పారితోషికం నుంచి నిర్మాణం దాకా ఎంతో ఖర్చు
  • హాలీవుడ్ లో అయితే వేల కోట్లు దాటుతున్న సినిమాల వ్యయం

సినిమా నిర్మాణం అంటేనే 24 విభాగాలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే సినిమాను 24 క్రాప్ట్స్ అని కూడా అంటుంటారు. ఎప్పటికప్పుడు సినిమాల్లో నాణ్యత కోసం ఖర్చు పెట్టడం పెరిగిపోతూనే ఉంది. అంతేకాదు... మా సినిమా నిర్మాణం కోసం ఇంత భారీ ఖర్చు పెట్టామంటూ లెక్కలు చెప్పుకోవడం కూడా చూస్తున్నాం. చిన్న చిన్న సినిమాలకు కూడా కోట్ల కొద్దీ ఖర్చుపెడుతున్న సమయం ఇది. మరి ఇప్పటివరకు నిర్మాణం కోసం అత్యంత ఎక్కువ ఖర్చయిన సినిమాలు ఏవో మీకు తెలుసా? జాతీయ మీడియా గణాంకాలు, ఇతర వివరాల మేరకు ఆ వివరాలివీ...!

అత్యంత ఖర్చయిన సినిమాలు ఇవే..
ప్రపంచంలో అతిపెద్ద సినిమా పరిశ్రమ హాలీవుడ్. సినిమాల నిర్మాణం కోసం అత్యంత ఎక్కువ ఖర్చుపెట్టేదీ అక్కడే. అందుకే అక్కడి సినిమాలే ఈ లిస్టులో టాప్ లో ఉన్నాయి.

స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్
హాలీవుడ్ గణాంకాల ప్రకారం... ఇప్పటివరకు అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే. దీని నిర్మాణం కోసం ఏకంగా... 447 మిలియన్ డాలర్లు ఖర్చయింది. మన కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ. 3,770 కోట్లు అన్నమాట. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా... సుమారు రూ.17,475 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్ డమ్
ఈ సినిమా బడ్జెట్  432 మిలియన్ డాలర్లు... అంటే రూ. 3,647 కోట్లు. ప్రపంచవ్యాప్తం చేసిన వసూళ్లు సుమారు రూ.8,400 కోట్లు.

స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కై వాకర్స్
ఈ సినిమా నిర్మాణం కోసం అయిన ఖర్చు సుమారు 416 మిలియన్ డాలర్లు... అంటే సుమారు రూ. 3,500 కోట్లపైనే. వసూళ్లు... దాదాపు రూ.9,033 కోట్లు.

ఫాస్ట్ ఎక్స్
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లోని తాజా సినిమా ఇది. దీని బడ్జెట్ సుమారు 379 మిలియన్ డాలర్లు... అంటే రూ. 3,200 కోట్లు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3 వేల కోట్ల దాకా వసూలు చేసింది.

పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్
ఈ సినిమా నిర్మాణం కోసం కూడా 379 మిలియన్ డాలర్లు.. అంటే రూ.3,200 కోట్ల వరకు ఖర్చయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8 వేల కోట్లకుపైనే వసూళ్లు రాబట్టింది.

  • Loading...

More Telugu News