Komatireddy Venkat Reddy: షోలాపూర్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం

Komatireddy Venkat Reddy election campaign in Sholapur

  • షోలాపూర్ అభ్యర్థి చేతన్ తరఫున మంత్రి ప్రచారం
  • చేతన్ చాలా మంచి వ్యక్తి... ఓటేసి గెలిపించాలన్న కోమటిరెడ్డి
  • తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్న మంత్రి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ తరఫున ప్రచారం నిర్వహించారు. చేతన్ చాలా మంచి వ్యక్తి అని, ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. కోట్లాది మంది మహిళలు ఇప్పటి వరకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించినట్లు చెప్పారు. తాము రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

More Telugu News