Allu Arjun: ఆ హీరో ఆరడుగుల బంగారం: 'అన్ స్టాపబుల్ 4'లో అల్లు అర్జున్!

 Unstoppable 4 New Episode

  • స్టార్ హీరోల గురించి స్పందించిన బన్నీ
  • మహేశ్ పట్ల గౌరవం ఉందని వ్యాఖ్య 
  • కల్యాణ్ గారికి ధైర్యం ఎక్కువని వివరణ
  • తనకి తానే పోటీ అంటూ స్పష్టీకరణ   


'అన్ స్టాపబుల్ సీజన్ 4' లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఆయనకి సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిపోడ్ లో అల్లు అర్జున్ గురించి దర్శకుడు రాఘవేంద్రరావు... త్రివిక్రమ్... గుణ శేఖర్... దిల్ రాజు బైట్స్ ఇచ్చారు. అంచలంచెలుగా అల్లు అర్జున్ ఎదుగుతూ వెళుతున్న తీరును గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. తాను ఎదగడంలో వాళ్లందరి పాత్ర ఉందనీ, అందుకు వారికి తాను థ్యాంక్స్ చెబుతున్నానని అల్లు అర్జున్ అన్నాడు. 

"మహేశ్ బాబు... పవన్ కల్యాణ్... ప్రభాస్ ఫొటోలను చూపిస్తూ, వాళ్లపట్ల అభిప్రాయం చెప్పమని బాలకృష్ణ అడిగారు. అందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ, "మహేశ్ బాబు అందగాడనేది అందరికి తెలిసిందే. ఒక ఫెయిల్యూర్ తరువాత ఆయన తీసుకునే కమ్ బ్యాక్ నాకు నచ్చుతుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోగా ఆయనంటే నాకు గౌరవం ఉంది. ఇక పవన్ కల్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయనకి ధైర్యం చాలా ఎక్కువ. ప్రభాస్ గురించి నేను అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట... ఆయన ఆరడుగుల బంగారం" అన్నాడు. 

'ఇక ఇప్పటి హీరోలలో సిద్ధూ జొన్నలగడ్డ నటన ఎక్కువగా నచ్చుతుంది. విజయ్ దేవరకొండ... నవీన్ పోలిశెట్టి... విష్వక్సేన్... అడివి శేష్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. వాళ్లంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎవరిని పోటీగా భావిస్తున్నారు? అనే బాలయ్య ప్రశ్న, ఆడియన్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. హీరోలందరి పట్ల తనకి గౌరవం ఉందనీ, తనకి తానే పోటీగా భావిస్తూ ఉంటానని తడుముకోకుండా అల్లు అర్జున్ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.

Allu Arjun
Balakrishna
Unstoppable 4
Mahesh Babu
Prabhas
  • Loading...

More Telugu News