KTR: హైడ్రా, మూసీ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులు పోశారు: కేటీఆర్

KTR fires at Revanth Reddy government

  • ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయం నింపారని ఆగ్రహం
  • మా భూములు మాకేనని ఎదిరించిన వారిని జైళ్ళకు పంపుతున్నారని ఆరోపణ
  • పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి పోయిందట అని ఎద్దేవా

హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులు పోసి వారి కంటికి కునుకు లేకుండా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఫార్మా సిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని మండిపడ్డారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా 'పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట' అంటూ ఎక్స్ వేదికగా చురక అంటించారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయమైందన్నారు. గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, కిరాయిలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ... 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని బెదిరించడం విడ్డూరమన్నారు. 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని, వందలాది గురుకుల పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి దూరమైందని, కాంగ్రెస్ తెచ్చిన మార్పును చూసి తెలంగాణ నివ్వెరపోతోందన్నారు. పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక... ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైందని, అభివృద్ధి దూరమైందని, కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతోందన్నారు.

  • Loading...

More Telugu News