Hyderabad: సీసీ కెమెరాల్లో హైదరాబాద్ రికార్డ్... ఎంత మందికి ఎన్ని కెమెరాలంటే!
- ట్రాఫిక్ నియంత్రణ నుంచి భద్రత, నిఘా దాకా సీసీ కెమెరాల తోడ్పాటు
- ఇటీవల నివేదిక విడుదల చేసిన కంపారిటెక్ సంస్థ
- ప్రపంచంలోని పెద్ద నగరాల్లో సగటున సీసీ కెమెరాల సంఖ్య వెల్లడి
రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ నుంచి నేరాల నియంత్రణ దాకా ఎన్నో అంశాల్లో సీసీ కెమెరాల సాయం ఎంతో కీలకం. ఇళ్లు, ఆఫీసులు అనే కాకుండా... వీధి వీధినా, ప్రధాన రోడ్లు, కూడళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులోనూ హైదరాబాద్ నగరం ఎంతో ప్రత్యేకం. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో హైదరాబాద్ మహా నగరం పరిధిలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా కొనసాగుతోంది.
చైనాను మినహాయిస్తే... హైదరాబాద్ టాప్
సీసీ కెమెరాల సంఖ్యలో హైదరాబాద్ ప్రపంచంతోనే పోటీ పడుతోంది. ఒక్క చైనా మినహాయిస్తే... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని నగరాలతో పోల్చినా హైదరాబాద్ లో సీసీ కెమెరాల సంఖ్య ఎక్కువ. దీనికి సంబంధించి కంపారిటెక్ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాల్లో... సగటున వెయ్యి మంది జనాభాకు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయన్న వివరాలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవిగో...
ప్రపంచంలోని పెద్ద నగరాల్లో... సగటున వెయ్యి మంది జనాభాకు సీసీ కెమెరాల సంఖ్య | |
---|---|
నగరం | సీసీ కెమెరాల సంఖ్య (ప్రతి వెయ్యి జనాభాకు...) |
చైనాలోని నగరాలు | 439 (సగటున) |
హైదరాబాద్ | 83 |
ఇండోర్ | 60 |
ఢిల్లీ | 20 |
సింగపూర్ | 18 |
మాస్కో | 17 |
బాగ్దాద్ | 15 |
సియోల్ | 14 |
సెయింట్ పీటర్స్ బర్గ్ | 13 |
లండన్ | 13 |
లాస్ ఏంజిలిస్ | 10 |
బుసాన్ | 10 |
హో చి మిన్ | 8 |
క్సిన్ బే | 8 |
చెన్నై | 8 |
బెర్లిన్ | 8 |
హాంగ్ కాంగ్ | 7 |
పుణె | 7 |
ఇస్తాంబుల్ | 7 |
కోచి | 7 |
బ్యాంకాంగ్ | 6 |
సిడ్నీ | 5 |
మాడ్రిడ్ | 4.2 |
పారిస్ | 4 |
రియో డి జెనోరో | 2 |
కేప్ టౌన్ | 1.6 |
టోక్యో | 1 |
టెల్ అవీవ్ | 1 |