Arvind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

Kejriwal offers prayers at Tirumala

  • కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
  • నిన్ననే తిరుమలకు చేరుకున్న కేజ్రీవాల్
  • రాత్రికి తిరుమలలో బస చేసిన ఢిల్లీ మాజీ సీఎం

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు అధికారులు స్వాగతం పలికారు. తన భార్య సునీతతో కలిసి ఈరోజు ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకుని, శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

శ్రీవారి దర్శనం కోసం కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి, ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

Arvind Kejriwal
Tirumala
Tirupati
AAP
  • Loading...

More Telugu News