Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్

UK High Commissioner Lindy Cameron met AP CM Chandrababu
  • చంద్రబాబును డైనమిక్ నేతగా అభివర్ణించిన బ్రిటీష్ హైకమిషనర్
  • టెక్నాలజీ పట్ల అనురక్తి ఉన్న నాయకుడని కితాబు
  • చంద్రబాబును కలవడం సంతోషదాయకమని వెల్లడి
భారత్ లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామెరాన్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. డైనమిక్ నేత, టెక్నాలజీపై బాగా పట్టున్న వ్యక్తి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, భారతదేశ పురోగతి పట్ల ఆయన విలువైన ఆలోచనల గురించి తెలుసుకోవడం ఈ భేటీ వెనుక ఉద్దేశమని వెల్లడించారు. 

యూనివర్సిటీల మధ్య ఒప్పందాలు, లోతైన సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్య సేవల రంగం వంటి అంశాల్లో పరస్పర ప్రయోజనాల దిశగా బ్రిటన్-భారత్ మధ్య భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని లిండీ కామెరాన్ వివరించారు. 

ఆమె తన ట్వీట్ తో పాటు సీఎం చంద్రబాబును కలిసిన ఫొటోను కూడా పంచుకున్నారు.
Chandrababu
Lindy Cameron
British High Commissioner
Andhra Pradesh
India

More Telugu News