Hebba Patel: ఓటీటీలోకి ఎంటరవుతున్న రొమాంటిక్ థ్రిల్లర్!

Sandeham Movie Update

  • జూన్ లో థియేటర్లకు వచ్చిన 'సందేహం'
  • ఐదు నెలల తరువాత ఓటీటీకి వస్తున్న సినిమా
  • హెబ్బా పటేల్ ప్రధాన పాత్రగా నడిచే కథ 
  • ఈ నెల 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్


 ఆరంభంలో హెబ్బా పటేల్ తన దూకుడు చూపించింది. ఆ తరువాత ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆమె అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడింది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె మళ్లీ పుంజుకుంది. అలా ఆమె చేసిన సినిమాలలో 'సందేహం' ఒకటి. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన కథ ఇది. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి సతీశ్ పరమవేద దర్శకత్వం వహించాడు.

థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైన ఐదు నెలలు దాటుతోంది. కొన్ని కారణాల వలన ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. హీరో సుమన్ తేజ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, శ్వేతా వర్మ .. రాశికా రెడ్డి .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' సొంతం చేసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

కథపై ఒక లుక్ వేస్తే ... శృతి (హెబ్బా పటేల్) ఆర్య (సుమన్ తేజ్) ను ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వలన ఆమె హర్ష (సుమన్ తేజ్) ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఫస్టు నైట్ నుంచే ఆమె ఆర్యను దూరం పెడుతుంది. ఆ సమయంలోనే మళ్లీ ఆమెకి దగ్గర  కావడానికి హర్ష ట్రై చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆర్య చనిపోతాడు. ఆర్య మరణం పట్ల అతని చెల్లెలికి అనుమానం కలుగుతుంది. ఫలితంగా శృతి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

Hebba Patel
Swetha Varma
Rashika Reddy
Sandeham Movie
  • Loading...

More Telugu News