Priyanka Gandhi: ఆ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi did not responded on waqf board bill

  • వయనాడ్‌లో పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న ప్రియాంక గాంధీ
  • ప్రజలు తనకు అవకాశం ఇస్తారని భావిస్తున్నానన్న ప్రియాంక గాంధీ
  • కొండచరియలు విరిగిపడితే కేంద్రం సాయంపై మీడియా ప్రతినిధి ప్రశ్న
  • స్పందించేందుకు నిరాకరించిన ప్రియాంక గాంధీ

ప్రస్తుతం తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదని ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ అన్నారు. వయనాడ్ ఉపఎన్నికకు ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం ఇస్తారని భావిస్తున్నానని తెలిపారు. వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి వారికి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా , కొండచరియలు విరిగిపడిన వయనాడ్ ప్రజలకు కేంద్రం నుంచి సహాయం అందలేదు కదా అని మీడియా ప్రతినిధులు వివిధ అంశాలపై ప్రశ్నించారు. దానికి ప్రియాంకగాంధీ స్పందిస్తూ... తాను ఇలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదన్నారు.

2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ రెండుసార్లు గెలిచారు. రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ, వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడి నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ, సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News