Caste Survey: కులగణనలో విద్యార్థి సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. వీడియో ఇదిగో!
--
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనలో ప్రైవేటు వ్యక్తులు పాల్గొనడంతో కలకలం రేగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే చేయిస్తున్నామని చెబుతూ ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వం ఈ సర్వే కోసం ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన సర్వే కోసం ఓ విద్యార్థి ఇంటికి రాగా ఆ ఇంటి యజమాని నిలదీసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం లభ్యం కాలేదు.
అయితే, ఈ వీడియోలో సర్వే కోసం ప్రైవేటు వ్యక్తులు ఎలా వస్తారంటూ యజమాని ప్రశ్నించడం కనిపిస్తోంది. కాగా, కులగణన కోసం 80 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధం చేశామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రాథమిక స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను, అంగన్ వాడీ సిబ్బందిని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఈ సర్వే కోసం ప్రాథమిక పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించడం గమనార్హం.