Chief Whip: చీఫ్ విప్ లు, విప్ లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
![AP govt announces Chief Whip amd Whips for assembly and council](https://imgd.ap7am.com/thumbnail/cr-20241112tn6733799590ed3.jpg)
అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులు
మండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధ
అసెంబ్లీలో 15 మంది... మండలిలో ముగ్గురు విప్ ల నియామకం
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో కీలక పదవులు భర్తీ చేసింది. అసెంబ్లీ, మండలిలో చీఫ్ విప్ లు, విప్ లను ప్రకటించింది. అసెంబ్లీలో 15 మందిని, మండలిలో ముగ్గురిని విప్ లు గా నియమించింది.
అసెంబ్లీలో చీఫ్ విప్: జీవీ ఆంజనేయులు
శాసనమండలిలో చీఫ్ విప్: పంచుమర్తి అనురాధ
అసెంబ్లీలో విప్ లు...
1. బొండా ఉమ (టీడీపీ)
2. కాలవ శ్రీనివాసులు (టీడీపీ)
3. యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ)
4. ఆదినారాయణరెడ్డి (బీజేపీ)
5. బొమ్మిడి నాయకర్ (జనసేన)
6. బెందాళం అశోక్ (టీడీపీ)
7. రెడ్డప్పగారి మాధవి (టీడీపీ)
8. అరవ శ్రీధర్ (జనసేన)
9. తంగిరాల సౌమ్య (టీడీపీ)
10. దాట్ల సుబ్బరాజు (టీడీపీ)
11. దివ్య యనమల (టీడీపీ)
12. పీజీవీఆర్ నాయుడు (టీడీపీ)
13. తోయక జగదీశ్వరి (టీడీపీ)
14. బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
15. వీఎం థామస్ (టీడీపీ)
మండలిలో విప్ లు...
1. వేపాడ చిరంజీవి (టీడీపీ)
2. పి.హరిప్రసాద్ (జనసేన)
3. కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
విప్ ల జాబితాలో... జనసేన నుంచి ముగ్గురు అసెంబ్లీ విప్ లు గా నియమితులు కాగా, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. అలాగే, మండలిలో జనసేన నుంచి ఒకరికి విప్ గా అవకాశం లభించింది.
ఇక అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.