Sasi Kumar: ఓటీటీ వైపు నుంచి మెప్పిస్తున్న 'నందన్' మూవీ!

Nandhan Movie Update

  • తమిళంలో రూపొందిన 'నందన్' మూవీ
  • గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • థియేటర్ రిలీజ్ విషయంలో హడావిడి  
  • సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు 
  • ఓటీటీ వైపు నుంచి లభిస్తున్న ఆదరణ


తమిళంలో ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో 'నందన్' ఒకటి. ఎరా శరవణన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో శశికుమార్ - సురుతి పెరియస్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. గిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేశారు. అయితే అప్పుడున్న పోటీ వలన ఈ సినిమాకి థియేటర్లు దొరకడం కష్టమైపోయింది. 

అందువల్ల ఆ హడావిడిలో ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా తమిళంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది.  అయితే థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేకపోయిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్టుగా తెలుస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈ కంటెంట్ కనెక్ట్ అయిందని అంటున్నారు. 

కథలోకి వెళితే... అది ఒక గ్రామం... ఆ గ్రామానికి ప్రెసిడెంట్ గా పెద్దకోపు లింగం (బాలాజీ శక్తివేల్) ఉంటాడు. చాలా కాలంగా అదే కులానికి సంబంధించిన... అదే కుటుంబానికి సంబంధించినవారే అక్కడ పెత్తనం చేస్తుంటారు. తక్కువ కులాల వారి పట్ల నియంతృత్వం చూపిస్తుంటారు. ప్రెసిడెంట్ కోపులింగం అంటే అంబేద్ కుమార్ (శశి కుమార్)కి ఎంతో అభిమానం. తన స్వార్థం కోసం అతణ్ణి పావుగా ఉపయోగించుకోవడానికి ప్రెసిడెంట్ ట్రై చేస్తాడు. పర్యవసానంగా ఏం జరుగుతుందనేది కథ. త్వరలో తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి.

Sasi Kumar
Suruthi Periyasamy
Balaji Shakthivel
Samudrakhani
  • Loading...

More Telugu News